

కోలీవుడ్ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా యాక్షన్ చిత్రం వెట్టువంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాలో ఆర్య, శోభితా ధూళిపాళ్ల, వి.ఆర్. దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయినట్లు సమాచారం. అయితే, కథకు మరింత బలం చేకూర్చేందుకు చిత్ర బృందం మరో మూడు రోజుల పాటు అదనపు షూటింగ్ నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రత్యేక షెడ్యూల్లో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా పాల్గొననున్నారని, ఆయన సినిమాలో పవర్ఫుల్ అతిథి పాత్రలో కనిపించవచ్చని టాక్ వినిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమాలో సూర్య పోషించిన రోలెక్స్ పాత్ర కథపై చూపిన ప్రభావం తరహాలోనే, వెట్టువంలో దుల్కర్ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చర్చ జరుగుతోంది. అయితే, అదనపు షూటింగ్, దుల్కర్ సల్మాన్ భాగస్వామ్యం, ఆయన పాత్ర వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!