
సినిమాలు

దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానుండటంతో నగరంలోని జేబీఎస్ (జూబ్లీ బస్ స్టేషన్), ఎంజీబీఎస్ (మహాత్మా గాంధీ బస్ స్టేషన్) బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బస్సులను ఆశ్రయిస్తున్నారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) దసరా సందర్భంగా 7 వేల ప్రత్యేక బస్సులను నడపనుంది. అయితే, ఈ ప్రత్యేక బస్సుల్లో 40 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు సమాచారం. పండుగ వేళ ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో బస్టాండ్లలో రద్దీ కొనసాగనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!