

ఓటరు జాబితాల సవరణలో అవకతవకలు జరిగాయంటూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తన నిరసనలను ఉధృతం చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైలలో ఆందోళనలు చేపట్టిన పార్టీ.. నేడు బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో ‘ఛప్పల్ ప్రొటెస్ట్’ పేరుతో చెప్పుల నిరసన నిర్వహించనుంది. పార్టీ వ్యవస్థాపకుడు, సమన్వయకర్త అభిజీత్ దీప్కే నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ఓటరు జాబితాల నుంచి పేర్లు తొలగించబడ్డాయని ఆరోపిస్తున్న బాధితులతో పాటు ప్రజా, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఈ నిరసనకు సినీ నటుడు ప్రకాశ్ రాజ్, యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు విద్యార్థి సంఘాల నేతలు ఐషే ఘోష్, నేహా బోరా మద్దతు తెలపనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకపోతే, అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్త నిరసన చేపడతామని సీజేపీ నేతలు హెచ్చరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!