
రాజకీయాలు

మహబూబాబాద్ జిల్లా పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ మేనేజర్ నరసింహారావుకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ ఫిర్యాదు అందడంతో ఈ తనిఖీలు చేపట్టారు. కార్యాలయంతో పాటు ఖమ్మంలోని ఆయన నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు.
నరసింహారావుకు సంబంధించిన ఇళ్లు, బినామీలుగా భావిస్తున్న వ్యక్తుల నివాసాలతో కలిపి ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్ సహా మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఆయనకు భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీలు, ఆస్తుల వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!