

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న ‘మెగా 158’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ప్రారంభం నుంచే ఈ ప్రాజెక్ట్‌కు మంచి స్పందన లభించగా, ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. మాస్ ఎలిమెంట్స్, వినోదం, భావోద్వేగాల సమ్మేళనంగా ఈ సినిమా రూపొందుతోందనే వార్తలు అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతున్నాయి.
ఇదే సమయంలో ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగాస్టార్ మరోసారి రెండు పాత్రల్లో కనిపించే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, అభిమానులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!