
ఆరోగ్యం

తన గంభీరమైన గొంతుతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు అర్జున్ దాస్. తమిళ సినిమాలతో పాటు తెలుగులో కూడా ఆయనకు మంచి అభిమానులు ఉన్నారు. అయితే ఇటీవల ఓజి సినిమాలో సాలిడ్ రోల్ దక్కించుకున్న తను ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉండగా, అర్జున్ దాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నువ్ ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే వాళ్ళు నిన్ను వదిలేస్తారు. అసలు ఎలా ఒకరు మూవ్ ఆన్ అవుతారు” అని ఆయన స్టోరీలో రాయడంతో చర్చ మొదలైంది. నిజంగానే అర్జున్ దాస్‌కు బ్రేకప్ జరిగిందా? లేక ఇది ఏదైనా సినిమా ప్రమోషన్ కోసమా? అంటూ మరికొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై స్పష్టత రావాలంటే అర్జున్ దాస్ స్వయంగా స్పందించాల్సి ఉంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!