

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నటుడు విజయ్ సేతుపతి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అదే సమయంలో, వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తున్న అరసన్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంకా మరికొన్ని ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నట్లు సమాచారం.
ఇప్పుడీ స్టార్ నటుడు మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విడాముయుర్చి ఫేమ్ దర్శకుడు మగిళ్ తిరుమేణి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను నటింపజేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆమె ఈ ఆఫర్‌కు ఓకే చెబితే కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ చూడొచ్చు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!