

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రస్తుతం కొంచెం నెమ్మదిగానే ముందుకు సాగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించలేదు.
ఈ క్రమంలో ఇప్పుడు ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ సీనియర్ స్టార్ భాగం అయ్యాడన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ నటుడు ఎవరో కాదు... అనీల్ కపూర్ అని టాక్. అనీల్ కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. ఇటీవల ‘యానిమల్’ వంటి సినిమాల్లో నటించిన ఆయన, తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎన్టీఆర్–నీల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పోస్ట్ షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో ‘డ్రాగన్’ సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారా? అన్న చర్చ మొదలైంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
.webp)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!