
బిజినెస్

మా ఇంటి బంగారం చిత్రానికి లభించిన స్పందన తర్వాత సమంత తన కెరీర్‌లో కొత్త దిశగా అడుగులు వేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వరుసగా నటిగా సినిమాలు చేయడం కంటే, బలమైన కథలతో కూడిన చిత్రాలను నిర్మించడంపై ఆమె దృష్టి పెట్టినట్లు సమాచారం. యువ దర్శకులు, కొత్త ప్రతిభకు అవకాశం కల్పించే ప్రాజెక్టులను రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలువురు కొత్త దర్శకుల కథలను సమంత పరిశీలించినట్లు టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం నిర్మాణ బాధ్యతలపైనే ఎక్కువగా దృష్టి పెట్టి వరుస ప్రాజెక్టులను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!