
సినిమాలు

భారతీయ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన హారర్-కామెడీ ఫ్రాంచైజీల్లో ‘కాంచన’ ఒకటి. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముని’తో ప్రారంభమైన ఈ సిరీస్, ‘కాంచన’ చిత్రాలతో దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో నాలుగో భాగంగా తెరకెక్కుతున్న ‘కాంచన 4’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన తర్వాత వరుస అప్డేట్లు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇప్పటికే పూజా హెగ్డే, నోరా ఫతేహి ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజాగా నటి స్వక్ష అయ్యర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు వెల్లడిస్తూ, ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!