

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది రోజులుగా కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో ఆమెకు ప్రేమ సంబంధం ఉందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. పెళ్లి వరకు వెళ్లొచ్చన్న రూమర్స్ కూడా వినిపించగా, ఫిబ్రవరిలో వివాహం జరుగుతుందనే ప్రచారం నెట్టింట వైరల్ అయ్యింది. అయితే అప్పట్లో ఈ వార్తలను మృణాల్ టీమ్ ఖండిస్తూ, ఇది కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే అని స్పష్టం చేసింది.
ఈ రూమర్స్ పూర్తిగా చల్లారకముందే మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో మృణాల్ డేటింగ్లో ఉందన్న ప్రచారం మొదలైంది. వీరిద్దరూ కలిసి నటించిన దో దీవానే షెహర్ మేన్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో సిద్ధాంత్ రెండు సార్లు మృణాల్‌పై పూల వర్షం కురిపించాడు. ఈ ఘట్టాన్ని వీడియోగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది.
ఈ వీడియో చూసిన అభిమానులు ఇది స్నేహమా లేదా ప్రేమకు ఆరంభమా అంటూ చర్చ మొదలుపెట్టారు. మరికొందరు ఇది పూర్తిగా సినిమా ప్రమోషన్లో భాగమేనని అభిప్రాయపడుతున్నారు. మృణాల్ లేదా సిద్ధాంత్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయినా ఒక్క వీడియోతోనే ఇంత చర్చ జరగడం మృణాల్ క్రేజ్‌ను మరోసారి చూపిస్తోంది. ఇది నిజమైన కెమిస్ట్రీనా లేదా ప్రమోషనల్ స్ట్రాటజీనా అన్నది కాలమే చెప్పాలి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!