

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్లో అత్యున్నత దశలో ఉన్నారు. పుష్ప సిరీస్‌తో దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న ఆయన, వరుసగా పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. దీని తర్వాత లోకేష్ కనగరాజ్‌తో ప్రాజెక్ట్, అలాగే సందీప్ రెడ్డి వంగా లేదా త్రివిక్రమ్‌తో మరో సినిమా చేసే అవకాశాలపై చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో పుష్ప 3 కూడా లైన్లోకి రావచ్చని ఇండస్ట్రీ టాక్.
ఈ బిజీ షెడ్యూల్ మధ్యే అల్లు అర్జున్ మరో కీలక బాధ్యతను తీసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తన తండ్రి అల్లు అరవింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్ బాధ్యతలను పూర్తిగా చేపట్టనున్నారట. 1972 లో ప్రారంభమైన ఈ సంస్థ తెలుగు సినిమాకు ఎన్నో హిట్ చిత్రాలు అందించింది. నిర్మాణంతో పాటు పంపిణీ, థియేటర్ల నిర్వహణ, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వంటి విభాగాల్లో విస్తరించింది. హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న అల్లు స్టూడియోస్ ఆలోచనలో కూడా అల్లు అర్జున్ పాత్ర ఉందని సమాచారం. సంస్థ వ్యవహారాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి, కొత్త మార్పులు తీసుకొస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అర్జున్ తన తొలి నిర్మాత ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా ‘ఎక్సైటింగ్ కాంబినేషన్’లో ఉండనుందని, హీరో పేరు మాత్రం ఇంకా వెల్లడించలేదని టాక్. అధికారిక ప్రకటన రాకపోయినా, అల్లు అర్జున్ నిర్మాతగా మారవచ్చనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
.png&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!