

అక్కినేని కుటుంబం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్లో ప్రముఖ కుటుంబంగా పేరున్న అక్కినేని ఫ్యామిలీ గురించి ఏ చిన్న వార్త వచ్చినా వెంటనే వైరల్ అవుతుంది. తాజాగా నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ ప్రెగ్నెంట్ అనే వార్తలు, అలాగే అఖిల్ అక్కినేని భార్య జైనబ్ రవ్జీ కూడా తల్లి కాబోతున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సమయంలో నాగార్జున చేసిన తాజా వ్యాఖ్యలు ఈ రూమర్స్‌ను మరింత పెంచాయి.
నాగచైతన్య జోష్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యి, ఏ మాయ చేసావే సినిమాతో స్టార్‌గా మారాడు. ఆ సినిమా ద్వారానే సమంతతో ప్రేమలో పడి 2017లో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల 2021లో ఇద్దరూ విడిపోయారు. తరువాత గత ఏడాది డిసెంబర్ 4న శోభిత ధూళిపాళ్లను సింపుల్‌గా వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల శోభిత ఫొటోలు వైరల్ కావడంతో ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు.

ఇక నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని జూన్‌లో తన ప్రియురాలు జైనబ్ రవ్జీని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి కూడా కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది. పెళ్లి తర్వాత వీరి ట్రిప్ ఫొటోలు వైరల్ అయ్యాయి. దాంతో జైనబ్ ప్రెగ్నెంట్ అన్న వార్తలు కూడా మొదలయ్యాయి. ఒక హెల్త్ ఈవెంట్లో ఈ రూమర్స్ గురించి ప్రశ్నించగా, నాగార్జున నవ్వుతూ “సరైన సమయం వచ్చినప్పుడు మీకే చెబుతాను” అన్నారు. ఈ సమాధానం రూమర్స్‌ను ఖండించకపోవడంతో మరింత చర్చకు దారి తీసింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ ఊహాగానాలుగానే చూడాలి.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!