

తమిళ స్టార్ సోదరులు సూర్య మరియు కార్తీ మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఇప్పుడు సూర్య తొలిసారిగా డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు. సితార సంస్థలో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘సన్నాఫ్ విశ్వనాధం’ ఈ సమ్మర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ వార్త ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
అయితే తెలుగు ప్రేక్షకుల డిమాండ్ మాత్రం కార్తీ డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలన్నదే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే అనేక సినిమాలతో కార్తీ తెలుగువారికి ఎంతో దగ్గరయ్యారు. ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ చెప్పే విధానం ప్రత్యేకంగా ఉండటంతో ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. ఇప్పుడు కార్తీ కూడా డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఈ చిత్రాన్ని ‘మ్యాడ్’ సిరీస్ రూపొందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్నారు. ఒకటి రెండు నెలల్లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఓ ప్రముఖ హీరోయిన్ను ఎంపిక చేయబోతున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మ్యాడ్ సిరీస్ తర్వాత రవితేజ తో సినిమా చేస్తారన్న వార్తలు వచ్చినా, ఇప్పుడు కార్తీ ప్రాజెక్ట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!