
జనరల్

‘కల్కి 2’లో సాయిపల్లవి నటించనున్నారనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 17న ఆమె ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే, సాయిపల్లవి భాగస్వామ్యంపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ ప్రాజెక్ట్ నుంచి దీపికా పదుకొణె తప్పుకున్న నేపథ్యంలో ఆమె స్థానంలో సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయిపల్లవి నటనపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!