

బాలీవుడ్లో డ్యాన్స్, స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలైకా ఆరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐటెం సాంగ్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె, స్టార్ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించింది. షారుఖ్ ఖాన్‌తో “ఛల్ ఛయ్య ఛయ్య” పాట ద్వారా బాలీవుడ్లో గుర్తింపు పొందిన మలైకా, తెలుగులో కూడా అతిథి, గబ్బర్ సింగ్ సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైంది. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, టీవీ హోస్ట్‌గా, జడ్జీగా కూడా ఆమె రాణిస్తోంది. అయితే సినిమాల కంటే ఆమె వ్యక్తిగత జీవితం తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది.
మలైకా ముందుగా అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుని, 2017 లో విడిపోయింది. ఆ తరువాత అర్జున్ కపూర్‌తో దాదాపు ఆరు సంవత్సరాలు రిలేషన్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇటీవల వీరిద్దరూ విడిపోయిన తర్వాత, మలైకా ఒక యువ వ్యాపారవేత్తతో కనిపించడం చర్చకు దారి తీసింది. ముంబైలోని ఒక సంగీత కార్యక్రమంలో ఇద్దరూ కలిసి కనిపించగా, ఇటలీలోని ట్రెవి ఫౌంటెన్ వద్ద ఓ మిస్టరీ మ్యాన్‌తో ఉన్న ఫోటో వైరల్ కావడంతో డేటింగ్ రూమార్స్ మరింత పెరిగాయి.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి పేరు హర్ష్ మెహతా అని, ఆయన 33 ఏళ్ల వజ్రాల వ్యాపారి అని ప్రచారం. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ లేదు. గతంలో గాసిప్‌లపై స్పందించిన మలైకా, “ఎవరి దగ్గర కనిపించినా లింక్ పెడతారు. స్నేహితుడైనా, మేనేజర్ అయినా కథలు సృష్టిస్తారు” అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం కొత్త రిలేషన్‌పై ఆమె లేదా ఆమె టీమ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అందువల్ల ఇది నిజమా లేక ఊహాగానాలేనా అన్నది ఇంకా సస్పెన్స్‌గా ఉంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!