

అఫ్గానిస్థాన్‌లో బాలికల విద్యపై తాలిబన్లు విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ ఇస్లామిక్ మతప్రచారకుడు జాకీర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. బాలికల విద్యపై నిషేధాన్ని ఆయన కేవలం ‘వాయిదా’గా అభివర్ణించినట్లు వచ్చిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. బాలికలను విద్యకు దూరంగా ఉంచడాన్ని సమర్థించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మలాలా యూసఫ్‌జాయ్ తండ్రి జియావుద్దీన్, అఫ్గాన్ ఎంపీ మరియం సోలైమాన్‌ఖిల్, చరిత్రకారిణి రుచికా శర్మ జాకీర్ నాయక్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. యునిసెఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2021 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు సుమారు 2.6 మిలియన్ల మంది అఫ్గాన్ బాలికలు సెకండరీ విద్యకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌లో బాలికల విద్యపై కొనసాగుతున్న ఆంక్షలు, వాటి ప్రభావంపై అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చర్చ మొదలైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!