

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు ట్రంప్, జిన్‌పింగ్ నిన్న సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో వాణిజ్యం, తైవాన్, ఇరాన్ యుద్ధం, క్రిటికల్ మినరల్స్, కృత్రిమ మేధస్సు పోటీ వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ట్రంప్‌కు, ఆయన కేబినెట్ సభ్యులు మార్కో రూబియో, స్కాట్ బెసెంట్ తో పాటు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, ఎన్వీడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ వంటి ప్రముఖులకు విందు ఇచ్చారు. సుమారు దశాబ్దం తర్వాత జరిగిన ఈ పర్యటనలో ట్రంప్‌కు చైనాలో ఘన స్వాగతం లభించింది. అనంతరం క్లోజ్డ్ డోర్ సమావేశం నిర్వహించారు.
వాణిజ్య సంబంధాలపై ఇరువురు సానుకూలంగా మాట్లాడగా, ట్రంప్ చైనాతో సంబంధాలు బలపడాలని, శత్రుత్వం కాకుండా మైత్రి కావాలని ఆకాంక్షించారు. మరోవైపు తైవాన్ అంశంపై జిన్‌పింగ్ కఠినంగా స్పందించారు. తైవాన్ విషయంలో ఎలాంటి జోక్యం జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన ఒప్పందాలపై రెండు దేశాలు కొన్ని కీలక అంగీకారాలకు వచ్చాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!