
జనరల్

మహిళల నుంచి అక్రమంగా అండాలను సేకరించారనే ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఐదు ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న సంస్థల్లో ఇందిరా ఐవీఎఫ్ సెంటర్, నర్మద ఫెర్టిలిటీ సెంటర్, ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్, సద్గురు ఏఆర్‌టీ సెంటర్, పద్మజ ఫెర్టిలిటీ సెంటర్ ఉన్నాయి. ఈ నోటీసుల నేపథ్యంలో ఆయా కేంద్రాల నిర్వాహకులు నేడు ఉదయం 11:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.
సంబంధిత ఆసుపత్రులు, ఫెర్టిలిటీ సెంటర్లకు చెందిన మేనేజింగ్ డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లు, సెంటర్ హెడ్‌లు కమిషన్ ముందు హాజరై చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఎదుట లిఖితపూర్వక వివరణలు సమర్పించనున్నారు. ఆయా కేంద్రాల ప్రతినిధులు ఇచ్చే వివరణలను పరిశీలించిన అనంతరం మహిళా కమిషన్ తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!