

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో డాక్టర్ వైఎస్సార్–డాక్టర్ కేవీపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అవార్డు–2026 ప్రదానోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్ ఆశయమైన ప్రాణహిత–చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యాన్ని ప్రస్తావించారు.
రైతుల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన కృషిని సీఎం గుర్తుచేశారు. 2003లో ఆయన చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర, రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు తీసుకున్న నిర్ణయం, విద్యుత్ బకాయిల రద్దు, రైతులపై కేసుల ఎత్తివేత వంటి చర్యలను ప్రస్తావించారు. భారతీయ వ్యవసాయం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి రంగాల్లో కృషి చేస్తున్న ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు డాక్టర్ వైఎస్సార్ అవార్డు–2026ను అందజేశారు. పేదలకు ఆహార భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రాధాన్యాన్ని కూడా సీఎం వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!