

అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగానికి సంబంధించిన క్రిమినల్ కేసును కొట్టివేయాలన్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. 2011లో నాందేడ్‌లో జరిగిన ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్యలపై భారతీయ శిక్షాస్మృతిలోని 295ఏ, 298 సెక్షన్ల కింద నమోదైన కేసులో జస్టిస్ ఆర్.ఎం. జోషి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. కేసు కాలపరిమితి దాటిందన్న ఒవైసీ వాదనను కూడా కోర్టు అంగీకరించలేదు. ఫిర్యాదు లేదా ప్రాసిక్యూషన్ ప్రారంభమైన తేదీనే పరిమితి లెక్కింపునకు ప్రామాణికమని స్పష్టం చేసింది.
ప్రసంగంలోని వ్యాఖ్యలు తొలుత రామజన్మభూమి అంశంపై అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉన్నప్పటికీ, అనంతరం భగవాన్ శ్రీరాముడు, ఆయన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్నాయని కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఆ వ్యాఖ్యలను ‘ప్లాన్డ్’, ‘ప్రీ-డిటర్మైండ్’, ‘మెజర్డ్’గా పేర్కొంది. ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతతో మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలిపింది. అయితే ఇవి ప్రాథమిక పరిశీలనలు మాత్రమేనని, ఒవైసీ దోషి అని కోర్టు తేల్చలేదని స్పష్టం చేసింది. తుది నిర్ణయం సాక్ష్యాల ఆధారంగా ట్రయల్ కోర్టుదేనని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!