
సినిమాలు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించిన తాజా ధరల ప్రకారం లీటర్ పెట్రోల్‌పై 97 పైసలు, డీజిల్‌పై 99 పైసలు పెంచినట్లు వెల్లడించాయి. ఈ పెరిగిన ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుత నెలలో ఇది మూడోసారి ఇంధన ధరల పెంపు కావడం గమనార్హం.
ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరల మార్పులు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో ఈ పెంపు జరిగినట్లు సమాచారం. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్య ప్రజల నెలవారీ ఖర్చులపై మరింత ప్రభావం చూపనున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!