
సినిమాలు

బంగారాన్ని వ్యూహాత్మక ఖనిజంగా గుర్తించాలని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశీయంగా బంగారం మైనింగ్‌ను ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం ఈ నిర్ణయం కీలకమని మండలి అభిప్రాయపడింది.
గనుల మంత్రిత్వ శాఖతో జరిగిన సమావేశంలో డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ మాట్లాడుతూ, గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టులకు సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లేకుండానే కేంద్రం నుంచి నేరుగా అనుమతులు మంజూరు చేసే విధానం అమలు చేయాలని ఆయన ప్రతిపాదించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!