
జనరల్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ తీవ్రమయ్యాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య మిస్సైల్ దాడులు పరస్పరం కొనసాగుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపగా, దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.
ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా ప్రతిదాడులకు దిగింది. బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇరాన్‌పై విరుచుకుపడినట్లు సమాచారం. ఈ పరస్పర దాడులతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగి, పరిస్థితి ప్రమాదకరంగా మారినట్లు అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!