

ప్రముఖ టెక్నాలజీ సంస్థ క్వాల్కామ్లో ఉద్యోగుల తొలగింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో సంస్థ చేపట్టినట్లు చెబుతున్న ఉద్యోగ కోతల నేపథ్యంలో ఓ ఉద్యోగి ఎదుర్కొన్న అనుభవం భావోద్వేగానికి గురిచేస్తోంది. నవంబర్ 18న తన వివాహం జరగాల్సి ఉండగా, పెళ్లి సెలవుల్లో ఉన్న సమయంలో ఉద్యోగం కోల్పోయినట్లు మేనేజర్ నుంచి సమాచారం అందిందని సదరు ఉద్యోగి వెల్లడించాడు. తన మేనేజర్‌ను పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించిన తర్వాత ఈ విషయం తెలిసిందని పేర్కొన్నాడు.
క్వాల్కామ్ ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగానే ఈ ఉద్యోగ కోతలు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు, ఉద్యోగాలు కోల్పోయిన పలువురు తమకు అందిన పరిహార ప్యాకేజీల వివరాలను ఆన్లైన్లో పంచుకుంటున్నారు. పెళ్లికి కొద్ది రోజుల ముందు ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగి ఉదంతం ప్రస్తుతం చర్చకు దారితీసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!