

తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఫోన్ చేసి, సందేశాలు పంపి, వివిధ మార్గాల్లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన నాయకులు, కూటమి భాగస్వాములు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు తన పుట్టినరోజును ఎంతో ఉత్సాహంగా జరిపినందుకు ధన్యవాదాలు చెప్పారు.
ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అభిమానులు చూపే ప్రేమ, ఆప్యాయత తనకు మరింత బాధ్యతగా పనిచేసేందుకు బలాన్ని ఇస్తాయని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ గౌరవిస్తూ తన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రేమ, అభిమానం తనకు ఎల్లప్పుడూ గొప్ప బలంగా నిలుస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!