
జనరల్

విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్‌కు నేడు కర్టెన్ రైజర్ కార్యక్రమం జరగనుంది. అక్టోబర్ 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్ 8 నుంచి 23 వరకు సరస్సు మేళాను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పున్నమి ఘాట్, ఎంబీకే స్టేడియం వేదికలుగా ఉత్సవాలను నిర్వహించనున్నారు.
విజయవాడ ఉత్సవ్‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించేందుకు చర్యలు చేపట్టారు. ఉత్సవాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక ఆకర్షణలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కర్టెన్ రైజర్ కార్యక్రమంతో ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!