
సినిమాలు

సినీ నటుడు విజయ్ దేవరకొండ వెండితెరపై మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డు నగదులో నుంచి రూ.25 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించడం, కరోనా సమయంలో 17,723 మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడం, తెలంగాణ మరియు కేరళ వరద బాధితులకు విరాళాలు అందించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆయన తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫస్ట్ జాబ్ ప్రోగ్రామ్, దేవరశాంటా, విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు వంటి పలు కార్యక్రమాలను విజయ్ చేపట్టారు. ‘ఖుషి’ సినిమా విజయానంతరం 100 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.1 కోటి అందజేశారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సమాజానికి తిరిగి ఇవ్వాలనే తన సంకల్పాన్ని విజయ్ దేవరకొండ నిరూపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!