

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ పరిస్థితులు నెలకొంటున్న వేళ భారత్ వ్యూహాత్మకంగా వెనెజువెలా నుంచి చౌక ధరలకు చమురును దిగుమతి చేసుకుంటోంది. తాజా నివేదికల ప్రకారం, మే 2026లో వెనెజువెలా భారత్‌కు మూడో అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది. ఎనర్జీ కార్గో ట్రాకర్ కెప్లర్ గణాంకాల ప్రకారం, ఈ నెలలో ఇప్పటివరకు భారత్ రోజుకు సుమారు 4,17,000 బ్యారెళ్ల వెనెజువెలా చమురును దిగుమతి చేసుకుంది. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 2,83,000 బ్యారెళ్లుగా నమోదైంది.
రష్యా, యూఏఈ ఇప్పటికీ భారత్‌కు ప్రధాన చమురు సరఫరాదారులుగానే ఉన్నప్పటికీ, హర్మూజ్ అంతరాయాలు మరియు పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరల నేపథ్యంలో భారతీయ రిఫైనరీలు వెనెజువెలా వైపు మొగ్గుచూపుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ దిగుమతుల్లో ముందంజలో ఉంది. వెనెజువెలా నుంచి వచ్చే అధిక సల్ఫర్ కలిగిన హెవీ క్రూడ్‌ను గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ సమర్థవంతంగా శుద్ధి చేయగలగడం రిలయన్స్‌కు పెద్ద ప్రయోజనంగా మారిందని నిపుణులు చెబుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!