
ఆరోగ్యం

శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ అధికారిక మీడియా ప్రకారం, బుషెహర్ ప్రావిన్స్‌లోని జామ్ ప్రాంతంలో శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాన్ని తమ వైమానిక దళాలు కూల్చివేశాయి. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందా లేదా అన్న వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ఈ ఆరోపణలను అమెరికా పూర్తిగా ఖండించింది. బుషెహర్ సమీపంలో తమ విమానం కూల్చేశారన్న వార్తలు అసత్యమని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరాన్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించింది. మరోవైపు, యుద్ధ విమానం కూలిపోతున్నట్లు చూపించే ఫొటోను ఇరాన్ సోషల్ మీడియాలో పంచుకోవడం రెండు దేశాల మధ్య వాదోపవాదాలను మరింత పెంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!