

ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై జరిగిన యుద్ధంలో అమెరికా భారీ నష్టాలను చవిచూసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సమాచారం ప్రకారం, యూఎస్‌కు చెందిన అత్యాధునిక MQ-9 రీపర్ డ్రోన్లలో దాదాపు 30 డ్రోన్లను ఇరాన్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ నష్టం పెంటగాన్ వద్ద ఉన్న ఆపరేషనల్ డ్రోన్ నిల్వల్లో సుమారు 20 శాతానికి సమానమని నివేదికలు చెబుతున్నాయి.
ఇరాన్ రక్షణ వ్యవస్థలు కొన్ని డ్రోన్లను గాల్లోనే కూల్చివేయగా, మరికొన్ని క్షిపణి దాడుల్లో నేలపై ధ్వంసమయ్యాయని సమాచారం. ఒక్క MQ-9 రీపర్ డ్రోన్ ధర దాదాపు 30 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని, వీటిలో అత్యాధునిక కెమెరాలు, సెన్సర్లు, దాడి సామర్థ్యాలు ఉంటాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్‌పై ఆపరేషన్లలో అమెరికా ఈ డ్రోన్లను భారీగా వినియోగించినట్లు సమాచారం. ప్రస్తుతం రీపర్ డ్రోన్ల ఉత్పత్తి మందగించడం అమెరికాకు మరో సవాలుగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!