

తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్నగర్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం, మక్కలు పూర్తిగా తడిసిపోయాయి. మార్కెట్ యార్డులు నీటమునిగిపోగా, రైతులు రాత్రికి రాత్రే ధాన్యం కుప్పలను కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సరిపడా టార్పాలిన్లు లేకపోవడం, లారీల కొరత, కొనుగోళ్లలో జాప్యం రైతులకు మరింత నష్టాన్ని మిగిల్చింది.
ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ, స్థానిక అధికారుల నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో రైతులు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లోనే 600 టన్నులకు పైగా ధాన్యం తడవగా, బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించారు. 15 నుంచి 45 రోజుల వరకు కొనుగోలు కేంద్రాల్లో వేచి చూసినా తూకం వేయకపోవడంతో వర్షాల కారణంగా మళ్లీ మళ్లీ నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!