
జనరల్

అమెరికా భారత్తో సుమారు రూ.4 వేల కోట్ల విలువైన రెండు కీలక రక్షణ ఒప్పందాలకు ఆమోదం తెలిపింది. ఈ డీల్లో భాగంగా భారత్ అపాచీ హెలికాప్టర్లకు సంబంధించిన సపోర్ట్ సర్వీసులు, ఎం777 అల్ట్రా లైట్ హోవిజ్జర్ వ్యవస్థలకు అవసరమైన పరికరాలు, సేవలను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందాలకు అమెరికా విదేశాంగ శాఖ క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం.
అపాచీ ప్యాకేజీలో ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, టెక్నికల్ సపోర్ట్, నిర్వహణ సేవలు ఉండగా, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ కంపెనీలు సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఎం777 హోవిజ్జర్ డీల్లో స్పేర్ పార్ట్స్, మరమ్మతులు, శిక్షణ, సాంకేతిక సహాయం అందించనున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్లు భారత సైన్యానికి మరింత బలం చేకూర్చనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!