
క్రీడలు

దాదాపు 78 సంవత్సరాల క్రితం కుదిరిన అంతర్జాతీయ కార్మిక ఒప్పందం ప్రకారం కార్మికులకు, కార్మిక సంఘాలకు సమ్మె చేసే హక్కు ఉందని ఐక్యరాజ్యసమితి అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో 1948లో కుదిరిన సంఘ స్వేచ్ఛ ఒప్పందం సమ్మె హక్కుకు రక్షణ కల్పిస్తుందని, దీనిపై 158 దేశాలు సంతకాలు చేశాయని న్యాయస్థానం పేర్కొంది.
మొత్తం 14 మంది న్యాయమూర్తులు ఈ అంశాన్ని పరిశీలించగా, అందులో 10 మంది న్యాయమూర్తులు కార్మికులకు సమ్మె హక్కు ఉందని తీర్పు వెలువరించారు. ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కులపై కీలక స్పష్టతనిచ్చిన నిర్ణయంగా భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!