
జనరల్

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బ్రూక్లిన్ ప్రాంతంలో ఉన్న మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 250 మందికి పైగా అత్యవసర సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన శునకాల బృందాల సాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చేపట్టారు. భవనం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!