

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్తో కుదిరిన ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం విజయవంతమైతే క్రెడిట్ తనదే, విఫలమైతే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్పై నింద వేస్తానని నవ్వుతూ చెప్పారు. అలాగే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం ఏర్పడడంతో, ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు తానే చర్చలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.
ఈ ఒప్పందం పెద్ద ఆర్థిక విపత్తును నివారించడానికే కుదిరిందని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు జేడీ వాన్స్ ఇజ్రాయెల్పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న ఏకైక నాయకుడు ట్రంప్ మాత్రమేనని అన్నారు. అమెరికా సహకారంతోనే ఇజ్రాయెల్ అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్విర్ ఒప్పంద నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదని పేర్కొనడం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!