

ఇరాన్‌పై సైనిక చర్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం ప్రకటించారు. ఇరాన్‌కు ఆర్థికంగా సహకరించే దేశాలు, సంస్థలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చమురు స్మగ్లింగ్, నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీల ద్వారా ఇరాన్‌కు మద్దతు ఇవ్వడం నిలిపివేయాలని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడమే తమ లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ పరిణామాలు భారత్‌పైనా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. 2025-26లో భారత్ నుంచి ఇరాన్‌కు సుమారు 1.25 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగగా, ఇరాన్ నుంచి 370 మిలియన్ డాలర్ల దిగుమతులు నమోదయ్యాయి. భారత్ నుంచి బాస్మతీ బియ్యం, తేయాకు, చక్కెర, పండ్లు, ఔషధాలు, మసాలాలు వంటి ఉత్పత్తులు ఇరాన్‌కు వెళ్తుండగా.. అక్కడి నుంచి పిస్తా, ఖర్జూరాలు, యాపిల్స్, కివీ వంటి ఉత్పత్తులు భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక వాణిజ్యం తగ్గినందున, అమెరికా చర్యల ప్రభావం భారత్‌పై పరిమితంగానే ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!