
క్రీడలు

అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతోంది. విదేశీ ఉద్యోగులను తక్కువ జీతాలతో నియమించకుండా అడ్డుకునేందుకు కనీస వేతనాలను భారీగా పెంచాలని యోచిస్తోంది. కొత్త ప్రతిపాదన ప్రకారం సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఏడాదికి సుమారు 1.62 లక్షల డాలర్ల జీతం ఉండాల్సి రావచ్చు. డల్లాస్, న్యూయార్క్ వంటి నగరాల్లో కూడా భారీ వేతన పరిమితులు అమలయ్యే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం విదేశీ ఉద్యోగులకు అధిక జీతాల ప్రయోజనం కలిగించినా, కంపెనీలు హెచ్-1బీ ఉద్యోగులను నియమించేందుకు వెనుకడుగు వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదనంగా ప్రతిపాదిత లక్ష డాలర్ల వీసా ఫీజు కూడా సంస్థలపై భారాన్ని పెంచనుంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే అమెరికా కంపెనీల నియామక విధానంలో పెద్ద మార్పులు వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!