

అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చల్లో యురేనియం ప్రధాన అంశంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యల్లో, ఇరాన్ శుద్ధి చేసిన యురేనియాన్ని అమెరికాకు అప్పగించాలనే లేదా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో నాశనం చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో, తమ వద్ద ఉన్న యురేనియాన్ని వదులుకోవడానికి సిద్ధమని ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. మసౌద్ పెజెష్కియాన్ కూడా ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకోలేదని, ప్రపంచానికి నమ్మకం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీ దాడులు నిర్వహించి 70కి పైగా హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. 10 కమాండ్ సెంటర్లతో పాటు పలు ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెంచుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!