

డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు అమెరికన్ యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఉదయం తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేసిన ట్రంప్, అమెరికా డిస్ట్రాయర్లు విజయవంతంగా హోర్ముజ్ జలసంధిని దాటి బయటకు వచ్చాయని, వాటికి ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు. అమెరికా ప్రతిదాడుల్లో దాడికి పాల్పడిన ఇరాన్ నౌకలు ధ్వంసమయ్యాయని తెలిపారు.
అమెరికా యుద్ధనౌకలపైకి ప్రయోగించిన క్షిపణులను కూల్చివేశామని, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేశామని ట్రంప్ పేర్కొన్నారు. చిన్న పడవలతో సహా పలు ఇరాన్ నౌకలు సముద్ర గర్భంలో మునిగిపోయాయని అన్నారు. ఇరాన్‌ను “సాధారణ దేశం కాదు” అంటూ విమర్శించిన ట్రంప్, ఆ దేశ నాయకత్వం అణు ఆయుధాలను ఉపయోగించే అవకాశమిస్తే తప్పకుండా వినియోగిస్తుందని ఆరోపించారు. త్వరగా ఒప్పందంపై సంతకం చేయకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!