
క్రీడలు

ఇరాన్ మరియు అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా ఇరాన్ దాడులకు పాల్పడగా, అమెరికా కూడా ప్రతిదాడులు చేపట్టింది. ఈ ఘటనల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. వీలైనంత త్వరగా ఒప్పందానికి రావాలని, లేకపోతే మరింత తీవ్ర దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇరాన్ దాడుల్లో తమ మూడు యుద్ధ నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రతిదాడుల్లో ఇరాన్‌కు చెందిన అనేక డ్రోన్లు, పడవలు ధ్వంసమైనట్లు తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో ఏ దేశమైనా తమ నౌకలకు అనుమతి ఇచ్చేదని, కానీ ఇరాన్ నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!