
సినిమాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం నేడు కుదిరే అవకాశం ఉందని ఆయన తన సామాజిక మాధ్యమ వేదికలో వెల్లడించారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించి స్థిరత్వానికి దోహదపడుతుందని తెలిపారు.
పశ్చిమాసియాలో శాంతి, భద్రత, సుస్థిరత సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం తర్వాత ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండవని ఆయన పేర్కొన్నారు. అయితే శాంతి ఒప్పందం విఫలమైతే ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!