
జనరల్

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. మొత్తం 5,98,193 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో వితంతు పెన్షన్లకు 3,31,236, ఒంటరి మహిళల పెన్షన్లకు 62,689, దివ్యాంగుల పెన్షన్లకు 1,48,882 దరఖాస్తులు వచ్చాయి.
అదేవిధంగా చేనేత కార్మికుల నుంచి 18,005, గీత కార్మికుల నుంచి 37,381 దరఖాస్తులు నమోదయ్యాయి. వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి, అర్హత ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!