

విశాఖపట్నం 2025 లో పర్యాటక కేంద్రంగా భారీ రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది నగరంలోని పర్యాటక ప్రాంతాలను 2.11 కోట్లకు పైగా సందర్శకులు సందర్శించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సింహాచలం ఆలయానికి 64 లక్షలకు పైగా భక్తులు రావడంతో అది మొదటి స్థానంలో నిలిచింది. ఆర్కే బీచ్‌కు 40 లక్షలకు పైగా సందర్శకులు వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కనకమహాలక్ష్మి ఆలయం, కైలాసగిరి పార్క్, రుషికొండ బీచ్‌లకు కూడా భారీగా పర్యాటకులు చేరుకున్నారు.
విశాఖలోని మ్యూజియంలు, వారసత్వ కట్టడాలు, వినోద కేంద్రాలు కూడా ఈ ఏడాది సందర్శకులతో కిక్కిరిశాయి. ఐఎన్ఎస్ కురుసురా మ్యూజియం, టీయూ-142 ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం, సముద్ర మ్యూజియంలకు లక్షల్లో సందర్శకులు వెళ్లారు. యారాడ బీచ్, భీమిలి బీచ్, తోట్లకొండ ప్రాంతాలు కూడా పర్యాటకులను ఆకర్షించాయి. అందమైన సముద్రతీరాలు, పార్కులు, అభివృద్ధి చెందిన సౌకర్యాలతో వైజాగ్ దేశంలో ప్రముఖ పర్యాటక నగరంగా మారుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!