

తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీజీ-సెట్) 2026 ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40,863 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 35,003 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,371 మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
ఫలితాలను సకాలంలో విడుదల చేసిన సిబ్బందిని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ అభినందించారు. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీ-సెట్ అధికారిక వెబ్‌సైట్ www.telanganaset.orgతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాలు, తదుపరి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!