
జనరల్

టీజీ ఈఏపీసెట్ 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మొత్తం మూడు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశలో జూన్ 19 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్, నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు జరగనుండగా, జూన్ 22 నుంచి 29 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జూన్ 25 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
జూలై 4న మాక్ సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల కానుండగా, జూలై 10న తొలి దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. రెండో దశ కౌన్సిలింగ్ జూలై 17న ప్రారంభమై, జూలై 22న సీట్ల కేటాయింపు ఉంటుంది. తుది దశ కౌన్సిలింగ్ జూలై 31 నుంచి ఆగస్టు 8 వరకు కొనసాగుతుంది. సీటు పొందిన విద్యార్థులు నిర్ణీత గడువులో ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్, కళాశాలలో భౌతికంగా హాజరుకావడం తప్పనిసరి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!