
జనరల్

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో చెత్త డంపింగ్ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. కర్ణాటకలోని బీదర్ జిల్లా నుంచి సేకరించిన చెత్తను తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుర్వాసన కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని న్యాల్కల్ మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మల్గి గ్రామస్తులు చెత్త వాహనాలను అడ్డుకుని నిరసన చేపట్టారు. డంపింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని బీదర్ పోలీసులు బెదిరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. వెంటనే డంపింగ్ యార్డ్‌ను తొలగించి, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చెత్త పారబోసే చర్యలను నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!