

తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలి దశ పూర్తయిందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు వెల్లడించారు. 2.73 శాతం మంది ఓటర్లను మృతులుగా గుర్తించగా, సుమారు 60 లక్షల మంది అనామలీస్ ఓటర్లు ఉన్నట్లు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అలాగే 32 లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ చేసుకోలేదని గుర్తించినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నోటీసులు అందుకున్న వారు సంబంధిత పత్రాలను సమర్పించి తమ వివరాలను నిర్ధారించుకోవాలని సూచించారు. ఓటు తొలగింపుపై అభ్యంతరాలు ఉన్నవారు తమ అభ్యంతరాలను సమర్పించవచ్చని తెలిపారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించనున్నారు. అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందికి పైగా అధికారులు పాల్గొంటారని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!