

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు విస్తృత ప్రచారం కల్పించేందుకు పర్యాటక శాఖ హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పడం ఈ ప్రచార కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు పర్యాటక శాఖ సంచాలకులు లక్ష్మణ్ రంజిత్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.
ఇందులో భాగంగా ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ సందర్భంగా బతుకమ్మ ప్రచార వీడియోను ప్రదర్శించారు. తద్వారా క్రికెట్ అభిమానులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేశారు. హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు నగరంలోని పలు ప్రముఖ ప్రాంతాల్లోనూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగర ప్రజలు, పర్యాటకులు, ప్రయాణికులకు బతుకమ్మ పండుగ ప్రత్యేకతను తెలియజేస్తూ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!