
సినిమాలు

సోగ్గాడే చిన్నినాయన చిత్రం అక్కినేని నాగార్జున కెరీర్‌లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అనంతరం వచ్చిన బంగార్రాజులో నాగార్జునతో పాటు నాగచైతన్య కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం మొదటి భాగం స్థాయిలో విజయం సాధించకపోయినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
ఇటీవల ఈ ఫ్రాంచైజీలో భాగంగా నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అక్కినేని ముగ్గురితో మరో సినిమా తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చాయి. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అయితే కథ వినిపించిన తర్వాత అది పూర్తిగా నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం నాగార్జున ‘కింగ్ 100’, నాగచైతన్య ‘వృషకర్మ’లో నటిస్తుండగా, అఖిల్ ‘లెనిన్’తో బ్లాక్‌బస్టర్ సాధించాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!